R Venkataramani : భారత అటార్నీ జనరల్ గా వెంకటరమణి
రాష్ట్రపతికి సిఫారసు చేసిన కేంద్ర సర్కార్
R Venkataramani : భారత దేశంలో అత్యున్నత పదవిగా భావించే అటార్నీ జనరల్ గా కేంద్ర ప్రభుత్వం సీనియర్ నాయకుడు ఆర్. వెంకటరమణి నియమితులయ్యారు. ప్రస్తుతం ఏజేగా పని చేస్తున్న కేకే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.
ఆయన స్థానంలో సీనియర్ న్యాయవాదిగా ఉన్న ఆర్. వెంకట రమణి నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన వెంకట్రమణి అక్టోబర్ 1, 2022న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 13, 1950న పాండిచ్చేరిలో పుట్టారు. 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పని చేశారు. 1979లో సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు.
ఏజీఏగా వెంకట్రమణి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. అటార్నీ జనరల్ గా వెంకట రమణి(R Venkataramani) నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను న్యాయ వ్యవహారాల శాఖ, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ విడుదల చేసింది.
విచిత్రం ఏమిటంటే కేకే వేణుగోపాల్ ను మూడుసార్లు పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. చివరకు తనకు వయసు రీత్యా చేత కాదని తాను పని చేయలేనంటూ కేంద్రానికి మొర పెట్టుకున్నారు.
దీంతో గత్యతరం లేక మరో సీనియర్ న్యాయవాదిగా ఉన్న గతంలో ఏజేగా పని చేసిన ముకుల్ రోహత్గీని పని చేయాలని కోరింది. కానీ ఆయన ముందు సమ్మతి తెలిపినా ఆ తర్వాత ఎందుకనో తాను పని చేయలేనంటూ ప్రకటించారు.
67 ఏళ్ల రోహత్గీ జూన్ 2017లో అటార్నీ జనరల్ గా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్ అధికారంలోకి వచ్చారు. చివరకు కేంద్ర సర్కార్ ఇవాళ ట్వీట్ చేసింది. ఆర్. వెంకటరమణిని(R Venkataramani) భారత దేశానికి అటార్నీ జనరల్ గా నియమించినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.
Also Read : జ్ఞాన్ వాపి కేసు విచారణ18కి వాయిదా