Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ చీఫ్ బరిలో మల్లికార్జున్ ఖర్గే
నామినేషన్ దాఖలు చేయనున్న డిగ్గీ రాజా
Mallikarjun Kharge : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. 20 ఏళ్ల తర్వాత గాంధీ ఫ్యామిలీ లేకుండా ఎన్నికలు జరగడం విశేషం.
ఇప్పటికే తాము పోటీ చేయబోమంటూ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). పార్టీ పదవికి సంబంధించి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ నామినేషన్లు సమర్పించేందుకు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. మొత్తం 9,000 వేల మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.
అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలను ప్రకటిస్తారు. పార్టీ చీఫ్ కోసం బరిలో పలువురు పోటీ పడనున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపించింది.
కానీ అనూహ్యంగా ఆయన పార్టీ చీఫ్ పదవిని తాను ఆశించడం లేదని, తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కలుసుకున్నారు. ఇంకో వైపు మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ సైతం మేడంను కలిసిన వారిలో ఉన్నారు.
చివరకు దిగ్విజయ్ సింగ్ పేరు ఖరారైంది. ఆయన కూడా తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతలో మరో బాంబు పేల్చింది పార్టీ. ఎంపీ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సైతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read : అధ్యక్ష బరిలో తివారీ..శశి థరూర్