Mahesh Joshi : అశోక్ గెహ్లాట్ నిర్ణయం అభినందనీయం
కితాబు ఇచ్చిన మంత్రి మహేశ్ జోషి
Mahesh Joshi : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో చివరి దాకా ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ఉన్నట్టుండి ఆఖరు నిమిషంలో తప్పుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మేడం సోనియా గాంధీ తప్పించేశారు.
తమకు విధేయుడిగా ఇప్పటికే పేరొందారు మాజీ సీఎంలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే. రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై సీరియస్ గా తీసుకున్నారు సోనియా గాంధీ. దీంతో తనదే తప్పైందంటూ ఒప్పుకున్నారు సీఎం.
ఆపై సంక్షోభ నివారణకు తాను కృషి చేస్తానని, చోటు చేసుకున్న పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్. రాజకీయాలలో సంక్షోభాలు సహజమేనని పేర్కొన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందన్నారు.
ఇదిలా ఉండగా రాజస్తాన్ లో సీఎంగా ఎవరు ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గెహ్లాట్ సోనియా గాంధీకి క్షమాపణ చెప్పారు. మరి గెహ్లాట్ ను కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే సమస్య సద్దు మణిగినట్లు భావించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా 90 మంది ఎమ్మెల్యేలు సీఎం గెహ్లాట్ కు మద్దతు పలికారు. కొద్ది మంది మాత్రమే సచిన్ పైలట్ వైపు నిలిచారు. ఇక అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రశంసలతో ముంచెత్తారు రాష్ట్ర మంత్రి మహేశ్ జోషి(Mahesh Joshi).
పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయక పోవడమే మంచిదన్నారు. ఆయన సేవలు ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. శుక్రవారం జోషి జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : త్రిముఖ పోటీకి మల్లికార్జున్ ఖర్గే రెడీ