Shashi Tharoor : రాజీవ్..గాంధీకి శశి థరూర్ నివాళి
పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్
Shashi Tharoor : భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. శుక్రవారం పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు రాజీవ్ గాంధీ మెమోరియల్ ను సందర్శించారు ఎంపీ.
రాజ్ ఘట్ కు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా పార్టీ చీఫ్ కోసం అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు ప్రకటించనున్నారు పార్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 30 శుక్రవారం ఆఖరి రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు. ఈ సందర్భంగా ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం 21వ శతాబ్ధానికి భారతదేశ వంతెనను నిర్మించిన అరుదైన నాయకుడు రాజీవ్ గాంధీ. ఆయనకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
భారత దేశం పాత దేశం కానీ యువ దేశం. నేను భారతదేశం బలమైన, స్వతంత్ర, స్వావలంబన , ప్రపంచ దేశాలలో అగ్రశ్రేణిలో, మానవాళి సేవలో రాజీవ్ గాంధీ అని కలలు కన్నానని పేర్కొన్నారు శశి థరూర్(Shashi Tharoor).
అంతే కాకుండా మహాత్మా గాంధీ స్మారకానికి నమస్కరించారు ఎంపీ. నా ప్రచారాన్ని ప్రారంభించే ముందు రాజ్ ఘట్ లో మహాత్ముడికి నివాళులు అర్పించానని తెలిపారు. సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించ గలరని ప్రశంసలతో ముంచెత్తారని కొనియాడారు.
Also Read : అశోక్ గెహ్లాట్ నిర్ణయం అభినందనీయం