CM KCR : ఎస్టీ కోటాను 10 శాతం పెంచిన కేసీఆర్

గిరిజ‌నుల సంక్షేమం కోస‌మే నిర్ణ‌యం

CM KCR : తెలంగాణ‌లోని గిరిజ‌నుల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం కేసీఆర్(CM KCR). షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కోటాను 10 శాతానికి పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల గిరిజ‌నుల జీవితాలలో పెను మార్పు రానుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర జ‌నాభాలో 10 శాతం ఉన్న గిరిజ‌నుల‌కు ద‌స‌రా పండుగ కానుకగా రాష్ట్ర స‌ర్కార్ అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చేలా షెడ్యూల్డ్ తెగ‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను 6 శాతం నుండి 10 శాతానికి పెంచింది.

ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా ఉత్త‌ర్వుల మేర‌కు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో పెంచిన రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తిస్తాయి.

కొన్నిఏళ్ల కింద‌ట రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపుద‌ల బిల్లును తెలంగాణ రాష్ట్ర శాష‌న స‌భ ఆమోదించింది. బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర‌ఫ‌తికి, కేంద్ర ప్ర‌భుత్వానికి పంపింది. కాగా ఆ బిల్లును కేంద్రం ఆమోదించ‌కుండా అలాగే ఉంచింది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర స‌ర్కార్, గిరిజ‌నులు చేసిన విజ్ఞ‌ప్తుల‌ను కేంద్రం ప‌ట్టించు కోలేద‌ని దీంతో గిరిజ‌నుల‌కు న్యాయం చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం పెంచిన రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తుంద‌ని కేసీఆర్(CM KCR) స్ప‌ష్టం చేశారు. నిన్న రాత్రి ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

ఇదిలా ఉండ‌గా 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాతే కేసీఆర్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో రిజ‌ర్వేష‌న్ల‌ను నిర్దేశిత ప‌రిమితిని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇంద్ర సాహ్ని కేసును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చినా గిరిజ‌నులు ఇంకా పేద‌రికంలోనే మ‌గ్గుతున్నార‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read : న‌ర‌సింహా క‌రుణించు న‌న్ను ర‌క్షించు

Leave A Reply

Your Email Id will not be published!