Shashi Tharoor : ఎన్నికల ప్రచారంలో శశి థరూర్ బిజీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక
Shashi Tharoor : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పోటీ మరింత ఆసక్తిని, ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరొందిన మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. ఇక గాంధీ యేతర కూటమి నుంచి తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) రంగంలో నిలిచారు.
ఆయన కూడా తన నామినేషన్ సమర్పించారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. ఇక పార్టీలో అసమ్మతి గ్రూప్ జి23లో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు శశి థరూర్. ఆయన రాసిన లేఖ కలకలం రేపింది. పార్టీకి సంబంధించి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికను పూర్తిగా పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ఇప్పటికే చాలా సార్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిన్న నామినేషన్ దాఖలు చేయడం పూర్తి కావడంతో ఇక ఎన్నికల క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు శశి థరూర్(Shashi Tharoor). శనివారం నాగ్ పూర్ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు.
1956లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తన అనుచరులతో కలిసి బౌద్ద మతాన్ని స్వీకరించిన దీక్షా భూమిలో శశి థరూర్ నివాళులు అర్పించారు. ఆదివారం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వార్ధా లోని మహాత్మా గాంధీ సేవా గ్రామ్ ఆశ్రమాన్ని థరూర్ సందర్శిస్తారు. థరూర్ టూర్ ను దేశ్ ముఖ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే వర్సెస్ శశి థరూర్ గా మారనుంది.
Also Read : ప్రతిపక్ష నాయకత్వ పదవికి ఖర్గే గుడ్ బై