Azam Khan : ఆజంఖాన్ కు ఊరట అరెస్ట్ నిలిపివేత
ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశం
Azam Khan : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్ కు భారీ ఊరట లభించింది. యూపీలోని అలహాబాద్ హైకోర్టు ఆయన అరెస్ట్ ను నిలిపి వేసింది. దీనిపై కోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
బాకూర్ ఖాన్ అనే వ్యక్తి ఈ కేసును తెరపైకి తెచ్చాడు. 2017లో నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు అదృశ్యమైన ఘటనపై ఈ ఏడాది సెప్టెంబర్ 19న కేసు నమోదైంది. బుల్ డోజర్లు , క్యారియర్లు ,ఇతర సామాగ్రితో సహా తప్పి పోయిన యంత్రాలు మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్శిటీ ప్రాంగణలో దొరికాయి.
అంతకు ముందు పోలీసులు ఆజం ఖాన్(Azam Khan) , ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం , మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 409, 120బి (నేర పూరిత కుట్ర) కింద రాంపూర్ మున్సిపల యంత్రాలు తప్పి పోయాయనే ఫిర్యాదుతో పాటు ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే సెక్షన్ 2 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యూపీ లోని మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్శిటీని స్వాధీనం చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను అంతకు ముందు రోజు ఉపసంహ రించుకున్నారు.
కాగా న్యాయమూర్తులు ఎం.ఆర్. షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తన ఫిర్యాదులతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్ ఆజం ఖాన్ కు స్వేచ్ఛను ఇచ్చింది.
ఈ అంశాన్ని విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించక పోవడంతో ఆజంఖాన్ తరపు న్యాయవాది పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని కోరారు. 87 కేసులు ఎదుర్కొంటున్నానని అతి కష్టం మీద బెయిల్ పొందానని కోర్టులో తెలిపారు. ఖాన్ కు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది.
Also Read : ఎన్నికల ప్రచారంలో శశి థరూర్ బిజీ