Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ యాత్రకు వర్షం అడ్డంకి
భారత్ జోడో యాత్ర వాయిదా
Rahul Gandhi Bharat Jodo Yatra : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం దెబ్బకు పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో ఎడ తెరిపి లేకుండా కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు, కుంటలు నిండి పోయాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాలను పూర్తి చేసుకుంది. కర్ణాటకలోకి ఎంటర్ అయ్యింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు.
దీనిపై ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. తాము గనుక రంగంలోకి దిగితే సీన్ వేరేగా ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా 3,570 కిలోమీటర్ల పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజుల పాటు కొనసాగుతుంది. రాహుల్ కు మద్దతుగా సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు యాత్రలో.
రాహుల్ యాత్ర కర్ణాటకలో 22 రోజుల పాటు యాత్ర సాగుతుంది. శనివారం వర్షాల కారణంగా యాత్ర వాయిదా పడింది. రాష్ట్రంలో 511 కిలోమీటర్ల మేర 20 రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీలోని ఆదోనికి చేరుకుంటుంది. తెలంగాణలోకి ప్రవేశించే ముందు రాయచూరు జిల్లా మీదుగా కర్ణాటకకు చేరుకుంటుంది.
యాత్ర ఏపీలో నాలుగు రోజులు కొనసాగుతుంది. అక్టోబర్ 24న తెలంగాణలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో సమన్వయ బృందం ఏర్పాట్లపై చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ దండి మార్చ్ లాగానే భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచి పోతుందన్నారు.
Also Read : కాంగ్రెస్ బాస్ నువ్వా నేనా