Say Vande Mataram : హ‌లో వ‌ద్దు వందేమాత‌రం వాడాలి

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం

Say Vande Mataram : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఇక నుంచి ఆంగ్గేయుల సంస్కృతిలో భాగ‌మైన హ‌లో సంస్కృతికి పుల్ స్టాప్ చెప్పాలంటూ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆదివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

ఇందులో భాగంగా ఇక నుంచి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌భుత్వంలో భాగ‌మైన వారంతా విధిగా హ‌లో అని ప‌ల‌క‌రింపున‌కు బ‌దులు వందేమాత‌రం చెప్పాల‌ని కోరింది. అంతే కాకుండా దీనిని త‌ప్ప‌నిస‌రి చేసింది.

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌భుత్వ రిజ‌ల్యూష‌న్ (జీఆర్) జారీ చేసింది. ఈ మేర‌కు కీల‌క ఉత్త‌ర్వులలో పేర్కొంది. ఇక నుంచి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారుల‌కు అధికారిక లేదా వ్య‌క్తిగ‌త ఫోన్ కాల్ ల స‌మ‌యంలో హ‌లో చెప్పేందుకు బ‌దులుగా వందేమాత‌రం(Say Vande Mataram) అని ప‌ల‌కాల‌ని స్ప‌ష్టం చేసింది.

కొత్త ప్ర‌చారంలో హలో బ‌దులుగా వందేమాత‌రం చెప్పాల‌ని మ‌హారాష్ట్ర అధికారుల‌ను కోరింది. ఈ మేర‌కు వార్దాలో జ‌రిగిన ర్యాలీలో సాంస్కృతిక వ్య‌వ‌హారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ . ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇదిలా ఉండ‌గా ఫోన్ కాల్స్ ను స్వీక‌రించేట‌ప్పుడు హ‌లోకి బ‌దులుగా వందేమాత‌రం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.

ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృతంగా ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ముందు ప్ర‌తి ఒక్క‌రు త‌ల్లిదండ్రుల‌కు న‌మ‌స్క‌రించాలి. ఆ తర్వాత హ‌లో చెప్పేకంటే ముందు వందేమాత‌రం చెప్పాల‌ని పిలుపునిచ్చింది. మ‌హాత్మా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా వార్దాలో ర్యాలీ చేప‌ట్టారు.

Also Read : నాసాలో మొద‌టి అమెరిక‌న్ మ‌హిళ

Leave A Reply

Your Email Id will not be published!