Soumya Swaminathan : ఆరోగ్యంపై పర్యావరణ ప్రభావం – సౌమ్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్
Soumya Swaminathan : కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్(Soumya Swaminathan). ఆదివారం మరోసారి కరోనా గురించి ప్రస్తావించారు ప్రత్యేకంగా. కరోనా ఈ ప్రపంచానికి ఎంతో నేర్పిందన్నారు. అది నేర్పిన పాఠం ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తుండి పోయే ఉంటుందన్నారు చీఫ్ సైంటిస్ట్.
ఇదిలా ఉండగా కరోనా తగ్గడం కోసం ఇప్పటికే ఉపయోగించిన టీకాలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాక్సిన్ల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల చాలా మటుకు శరీరంపై ప్రభావం చూపుతున్నాయని దాని వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాదాల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు సౌమ్య స్వామినాథన్(Soumya Swaminathan).
ప్రధానంగా ఆయా దేశాలు ప్రజారోగ్య విధానం, డేటా, పరిశోధన కు సంబంధించిన ప్రాముఖ్యత గురించి కూడా నొక్కి చెప్పారు. వాతావరణ మార్పు, పర్యావరణానికి మానవులు ఏమి చేశారనే దానిపై కరోనా ప్రధానంగా ఆధారపడి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మన జీవితాలు పర్యావరణ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు .
ఇదిలా ఉండగా ఇటీవల దాయాది పాకిస్తాన్ లో ఇటీవల చోటు చేసుకున్న వరదల ప్రభావం అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎంతో విలువైన పశు సంపదను కోల్పోవడం బాధాకరమన్నారు సౌమ్య స్వామినాథన్. ప్రతి ఒక్కరు కరోనా నుంచి కాపాడుకునేందుకు శ్రద్ద పెట్టాలని సూచించారు చీఫ్ సైంటిస్ట్.
బూస్టర్ డోస్ తీసుకున్నా కొందరికి కరోనా సోకుతుందన్న దానిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఏమీ లేదని దాని రేటు కేవలం 2 శాతానికి మించి ఉండదన్నారు సౌమ్య స్వామినాథన్.
Also Read : హలో వద్దు వందేమాతరం వాడాలి