Rahul Gandhi : గాంధీని చంపిన సిద్ధాంతంతో యుద్ధం – రాహుల్
భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ నేత ఆగ్రహం
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయునాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేశారు. నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.
దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీని ఇవాళ చంపిన వారే కొనియాడుతున్నారని, వారికి పూజలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే తాము మహాత్ముడిని చంపిన సిద్దాంతంతోనే యుద్దానికి దిగామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ప్రారభమైన ఈ యాత్ర కేరళలో ముగిసింది. నిన్న కర్ణాటకకు చేరుకుంది. రాహుల్ గాంధీకి అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు. నిన్న భారీ వర్షం చోటు చేసుకోవడంతో తన యాత్రకు విరామం ప్రకటించారు.
ఇవాళ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా కర్ణాటకలోని బదనవాలు లోని ఖాదీ గ్రామోద్యగ కేంద్రాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ.
హింస, అబద్దాల రాజకీయాల మధ్య కాంగ్రెస్ కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర అహింస, స్వరాజ్ సందేశాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు.
జాతి పితామహుడి వారసత్వాన్ని అధికారంలో ఉన్న వారు పొందడం సౌకర్యంగా ఉన్నప్పటికీ ఆయన అడుగు జాడల్లో నడవడం చాలా కష్టమైన విషయమన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
హింస అబద్దాల రాజకీయాల మధ్య కాంగ్రెస్ చేపట్టిన యాత్ర అహింస, స్వరాజ్ సందేశాన్ని వ్యాప్తి చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా 1927లో గాంధీ సందర్శించిన ఈ ఖాదీ గ్రామోద్యోగ కేంద్రాన్ని ఆదివారం రాహుల్ గాంధీ సందర్శించడం విశేషం.
Also Read : తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ద్రోహం చేయలేను