Sudhakar Singh : నితీష్ కు షాక్ మంత్రి సింగ్ రాజీనామా
వ్యవసాయ శాఖ మంత్రి కోలుకోలేని షాక్
Sudhakar Singh : బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు షాక్ తగిలింది. వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ప్రకటించారు. రామ్ గఢ్ లో తొలిసారిగా ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సుధాకర్ సింగ్(Sudhakar Singh).
సీఎంని అనేక సందర్భాల్లో తన శాఖలో అవినీతి, బ్యూరోక్రాటిక్ పై చేయి గురించి మాట్లాడుతూ మాటలు పేల్చుతూ వచ్చారు. గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు.
ఆయన తండ్రి రాష్ట్ర ఆర్జేడీ చీఫ్ జగదానంద్ సింగ్ వెల్లడించారు. రైతు సంఘం ఆందోళనలకు తన గొంతును ఇచ్చారు. కొన్ని సార్లు సరిపోదు. త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల వ్యవసాయ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారని చీఫ్ వెల్లడించారు.
తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారని పేర్కొన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు సామీపత్య ఉన్న జగదానంద్ సింగ్ , రాష్ట్ర యూనిట్ చీఫ్ గా వరుసగా రెండోసారి పదవిని పొందారు. ఈ చీలిక పెరగడం తమకు ఇష్టం లేకనే తామే తప్పుకున్నామని స్పష్టం చేశారు.
అక్టోబర్ 2 ఇవాళ. మహాత్మాగ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. వారి స్మృతులను స్మరించుకుంటూ రైతులతో సానుభూతి చూపుతూ వారి అడుగు జాడల్లోనే తన కుమారుడు నడిచాడని ఆర్జేడీ పార్టీ చీఫ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ మంత్రి గుడ్ బై చెప్పడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కలకలం రేపింది.
Also Read : ఖర్గేతో బహిరంగ చర్చకు రెడీ – థరూర్