Shashi Tharoor : ఖ‌ర్గేతో బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ – థ‌రూర్

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పెరిగిన పోటీ

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న అస‌మ్మ‌తి నాయ‌కుడిగా పేరొందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశారు. గాంధీ ఫ్యామిలీ ఆశీస్సులు పొందిన ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌ధాన పోటీదారుడిగా ఉన్నారు. ఈ త‌రుణంలో ఖ‌ర్గే, థ‌రూర్ పోటా పోటీగా ప్ర‌చారం చేప‌ట్ట‌డంలో నిమ‌గ్నం అయ్యారు.

ఆదివారం శ‌శి థ‌రూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో(Shashi Tharoor) తాను బ‌హిరంగంగా చ‌ర్చించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు స‌వాల్ విసురుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. తాను అస‌మ్మ‌తి నాయ‌కుడి కానే కానంటూ వెల్ల‌డించారు. పార్టీలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి వేసిన నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 17న కాంగ్రెస్ చీఫ్ కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 19న ఫలితం ప్ర‌క‌టిస్తారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ.

పార్టీ ఎప్ప‌టి లాగే ఉండాల‌ని అనుకుంటే మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను ఎన్నుకోవాల‌ని కానీ పార్టీలో సంస్క‌ర‌ణ‌లు, మార్పులు కావాల‌ని అనుకుంటే త‌న‌ను ఎన్ను కోవాల‌ని కోరారు.

ఇదే స‌మ‌యంలో శ‌శి థ‌రూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హైక‌మాండ్ క‌ల్చ‌ర్ ను పూర్తిగా తుడిచి వేస్తాన‌ని ప్ర‌క‌టించారు శ‌శి థ‌రూర్ . త‌మ మ‌ధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌ని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

ఇప్ప‌టికే అంగీక‌రించిన ల‌క్ష్యాల‌ను ఎలా సాధించాల‌నేది తాము ప్ర‌తిపాదిస్తున్నామ‌ని అన్నారు బ‌రిలో ఉన్న ఎంపీ.

Also Read : తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు ద్రోహం చేయ‌లేను

Leave A Reply

Your Email Id will not be published!