Jai Shankar : 5 నుంచి జై శంక‌ర్ విదేశీ ప‌ర్య‌ట‌న

ఆస్ట్రేలియా..న్యూజిలాండ్ లో టూర్

Jai Shankar : కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(Jai Shankar) త్వ‌ర‌లో విదేశీ ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న త‌న టూర్ లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈ టూర్ లో న్యూజిలాండ్ లో ప్రారంభం అవుతుంది. నానియా మ‌హూతాతో ద్వైపాక్షిక స‌మావేశంలో పాల్గొంటాడు. వాణిజ్యం నుండి భద్ర‌త వ‌ర‌కు కీల‌క‌మైన రంగాల‌లో ఇరు దేశాల‌తో భార‌త దేశ సంబంధాల‌ను పెంపొందించే ల‌క్ష్యంతో స‌మావేశాల కోసం జై శంక‌ర్ అక్టోబ‌ర్ 5 నుంచి 11 మ‌ధ్య వారం రోజుల పాటు ఈ టూర్ కొన‌సాగుతుంది.

ద్వైపాక్షిక స‌మావేశం ఆక్లాండ్ లో కొన‌సాగుతుంది. ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రిగా ఉన్న జై శంక‌ర్ న్యూజిలాండ్ కు వెళ్లడం ఇదే మొద‌టిసారి.

ఇదే క్ర‌మంలో అక్టోబ‌ర్ 6న న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జ‌సిండా ఆర్డెర్న్ తో క‌లిసి భార‌త కమ్యూనిటీ స‌భ్యుల అసాధార‌ణ విజ‌యాలు , విరాళాలు అందించినందుకు వారిని స‌త్క‌రించే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. న్యూజిలాండ్ లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జ్ఞాప‌కార్థం ఇండియా 75 పోస్ట‌ల్ స్టాంపుల‌ను విడుద‌ల చేస్తారు.

ఇదిలా ఉండ‌గా న్యూజిలాండ్ లో మంత్రి అయిన మొద‌టి భార‌తీయ సంత‌తి వ్య‌క్తి అయిన క‌మ్యూనిటీ , వైవిధ్య శాఖ మంత్రి ప్రియాంక రాధాకృష్ణ‌న్ తో స‌హా ప‌లువురు మంత్రుల‌తో కూడా జై శంక‌ర్(Jai Shankar) సంభాషించ‌నున్నారు.

విద్యార్థుల‌తో స‌మా పార్ల‌మెంటేరియ‌న్లు, వ్యాపార సంఘం స‌భ్యులు , భార‌తీయ ప్ర‌వాసుల‌ను క‌లుస్తారు. వెల్లింగ్ట‌న్ లో కొత్త‌గా నిర్మించిన భార‌త్ హై క‌మిష‌న్ భ‌వాన్ని ప్రారంభిస్తారు జై శంక‌ర్. అంతే కాకుండా మోడీ డ్రీమ్స్ మీట్ డెలివ‌రీ పుస్త‌కాన్ని కూడా ఆవిష్క‌రిస్తారు.

Also Read : సైబ‌ర్ క‌మాండ్ ఏర్పాటుకు శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!