PFI Seals : పీఎఫ్ఐ ఆఫీసులు సీజ్ కేసులు నమోదు
ఇప్పటికే ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధం
PFI Seals : దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఇప్పటికే ఐదేళ్ల పాటు నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI Seals) . సదరు సంస్థకు చెందిన ఎనిమిదికి పైగా అనుబంధ సంస్థలపై వేటు వేసింది.
అంతే కాకుండా వాటికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పట్టాయి. విస్తృతంగా దాడులు, సోదాలు చేపట్టింది ఈడీ, సీబీఐ, ఐటీ. రెండు విడతలుగా దేశంలో దాడులు చేపట్టిన ఈడీ 106 మందిని అరెస్ట్ చేసింది.
రెండోసారి జరిపిన దాడుల్లో 400 మందికి పైగా అదుపులోకి తీసుకుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పీఎఫ్ఐ సంస్థకు చెందిన మూడు ప్రధాన కార్యాలయాలపై ఫోకస్ పెట్టింది. వాటిని సోమవారం సీజ్ చేసింది. అంతే కాకుండా పీఎఫ్ఐ(PFI Seals) నాయకులు, బాధ్యులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో యూఏపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పలు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులపై సోదాలు చేపట్టి మూసి వేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) , ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ తో పాటు వివిధ రాష్ట్రాల సంస్థలతో కలిసి సోదాలు చేపట్టాయి. మొత్తం దర్యాప్తులలో పీఎఫ్ఐకి చెందిన కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
Also Read : 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు – ఈసీ