Sonia Gandhi : మైసూరుకు చేరుకున్న సోనియా గాంధీ
జోడో యాత్రలో పాల్గొనున్న కాంగ్రెస్ చీఫ్
Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) కర్ణాటకలోని మైసూరుకు చేరుకున్నారు. ఈనెల 5న దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
దేశంలోనే ఎక్కువగా దసరా పండుగను పురస్కరించుకుని ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ సోమవారం అధికారిక పర్యటన నిమిత్తం కర్ణాటకలోని మైసూరుకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా తనయుడు మాజీ పార్టీ చీఫ్, వాయునాడు ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టారు.
ఆ యాత్ర 3,570 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రాలలో యాత్ర పూర్తయింది. ప్రస్తుతం కర్ణాటకకు చేరుకుంది భారత్ జోడో యాత్ర. ఓ వైపు భారీ వర్షాలు కొనసాగుతున్నా ఎక్కడా యాత్రను ఆపకుండా నిర్వహిస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా జోడో యాత్రలో మేడం సోనియా గాంధీ(Sonia Gandhi) గురువారం పాల్గొంటారని కాంగ్రెస పార్టీ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల విరామం తర్వాత సోనియా గాంధీ పార్టిసిపేట్ చేస్తారని స్పష్టం చేసింది.
ఈ యాత్ర కాశ్మీర్ కు చేరుకుంటుంది. మొత్తం భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు కొనసాగనుంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేశారు.
ప్రధానంగా వర్షాలు వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆగదని స్పష్టం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న సోనియా గాంధీ తొలిసారి రాష్ట్రాన్ని పర్యటించడం.
ఈ సందర్భంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సారథ్యంలో భారీ స్వాగతం పలికారు మేడంకు.
Also Read : ములాయంకు మెరుగైన చికిత్స