Arvind Kejriwal : సత్యం మార్గం సులభం కాదు – కేజ్రీవాల్
అక్రమ అరెస్ట్ లకు మూల్యం తప్పదు
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు నమోదు చేయడం వల్ల లేదా అరెస్ట్ చేసి జైళ్లో పెట్టడం ద్వారా సత్యాన్ని నిర్మూలించడం ఎన్నటికీ కాదన్నారు. తన పార్టీకి చెందిన మంత్రి సత్యేందర్ జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను ప్రస్తుతం జైల్లో పెట్టింది.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. అందులో మొదటి నిందితుడిగా సిసోడియాను చేర్చింది. ఈ సందర్భంగా సోమవారం కీలక కామెంట్స్ చేశారు అరవింద్ కేజ్రీవాల్.
ఇవాళ సత్యేందర్ జైన్ పుట్టిన రోజు. ఫేక్ కేసు కారణంగా నాలుగు నెలలగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం అనేది అత్యంత బలీయమైనది. దానిని ఎవరూ భరించ లేరు. ఎందుకంటే దానిని ఆచరించాలంటే చాలా ధైర్యం కావాలి. అంతకంటే ధర్మ నిరతి కలిగి ఉండాలన్నారు అరవింద్ కేజ్రీవాల్.
కాగా నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు సత్యేంద్ర జైన్(satyendar jain) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.
ప్రస్తుతం ఢిల్లీ వర్సెస్ కేంద్రం మధ్య పోరు నడుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య వార్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇవాళ సీఎం చేసిన ట్వీట్ ఆసక్తిని రేపింది.
Also Read : పీఎఫ్ఐ ఆఫీసులు సీజ్ కేసులు నమోదు