CM KCR : ద‌స‌రా ముహూర్తం పార్టీ ఆవిర్భావం

వెల్ల‌డించ‌నున్న సీఎం కేసీఆర్

CM KCR : గ‌త కొంత కాలంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న జాతీయ పార్టీపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు.

ఈ మేర‌కు పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను కూడా సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం. ద‌స‌రా పండుగ రోజు జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు సీఎం. దేశ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖ‌రారు చేశారు.

సెప్టెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:19 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.ఆదివారం, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అని కూడా పిలుస్తారు, తన మంత్రివర్గ సహచరులు మరియు పార్టీలోని మొత్తం 33 జిల్లాల అధ్యక్షులతో లంచ్ మీటింగ్ నిర్వహించారు.

ఇందులో భాగంగా ఈనెల 5న బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో టీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్షం, రాష్ట్ర కార్య‌వ‌ర్గ విస్తృత స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవ‌త‌రించ‌డంపై ప్ర‌త్యేకంగా తీర్మానం చేయ‌నున్నారు.

దీనిని భార‌తీయ రాష్ట్ర స‌మితి లేదా బీఆర్ఎస్ అని పిలుచుకునే చాన్స్ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, మేయ‌ర్లు ,మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్లు క‌లిపి మొత్తం 283 మంది హాజ‌రు కానున్నారు.

అంతే కాకుండా ఈ కీల‌క మీటింగ్ లో టీఆర్ఎస్ పేరు మార్చాల‌ని కోరుతూ తీర్మానాన్ని ఎన్నిక‌ల సంఘానికి పంప‌నున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా టీఆర్ఎస్ ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయ‌వ‌చ్చు.

రాబోయే 2024 జాతీయ ఎన్నిక‌ల్లో దాని ప‌నితీరు ఆధారంగా టీఆర్ఎస్ జాతీయ పార్టీ హోదాను కోర‌వ‌చ్చు. అంత‌కంటే ముందు కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగు లేదా అంత‌కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించ‌డం ద్వారా జాతీయ పార్టీ హోదా పొంద‌వ‌చ్చు.

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భ‌విస్తుంద‌ని రాబోయే ఎన్నిక‌ల్లో ఇరువురి మ‌ధ్యే పోటీ ఉంటుందని కేసీఆర్ పేర్కొంటున్నారు.

Also Read : పీఎఫ్ఐ ఆఫీసులు సీజ్ కేసులు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!