Sanjay Raut : సంజయ్ రౌత్ కు షాక్ కస్టడీ పొడిగింపు
పత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్ట్
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కు కోలుకోలేని షాక్ తగిలింది. పత్రాచల్ భూ స్కాంకు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎంపీని అరెస్ట్ చేసింది. కోర్టులో హాజర్చడంతో కస్టడీకి తరలించింది. ఈ కేసులో కోర్టు రౌత్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ వరకు పొడిగించింది.
పత్రాచాల్ భూ కుంభకోణంలో పెద్ద ఎత్తున కోట్లు చేతులు మారాయని ఆరోపించింది. ఇప్పటికే ఆయనతో పాటు భార్య, సోదరుడిని కూడా విచారించింది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా జూలై లో అరెస్ట్ చేసింది. దక్షిణ ముంబై లోని ఈడీ కార్యాలయంలో ఏకంగా ఆరు గంటలకు పైగా విచారించింది.
అనంతరం జూలై 31న అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. ఇదే క్రమంలో కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఇప్పటి వరకు సంజయ్ రౌత్ కు సంబంధించి పలుమార్లు కస్టడీ పొడిగించింది. తాజాగా మరోసారి శివసేన ఎంపీకి షాక్ ఇచ్చింది కోర్టు. మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా గత నెల 10న సంజయ్ రౌత్(Sanjay Raut) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. కాగా తనను కావాలని టార్గెట్ చేసింది కేంద్రం అంటూ నిప్పులు చెరిగారు ఎంపీ సంజయ్ రౌత్ . ఆయన శివసేనలో కీలకమైన నాయకుడిగా పేరొందాడు.
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అనుంగు అనుచరుడిగా పేరొందారు సంజయ్ రౌత్. ప్రతిపక్షాల కూటమిలో కీలక పాత్ర పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే మరాఠా రాజకీయాల్లో కింగ్ పిన్ గా మారారు.
Also Read : జర్నలిస్ట్ మర్డర్ కేసులో కీలక మలుపు