JK Internet Blocked : జ‌మ్మూ కాశ్మీర్ లో ఇంట‌ర్నెట్ సేవ‌లు బ్లాక్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టూర్

JK Internet Blocked :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌డంతో ముంద‌స్తుగా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మ‌రో వైపు త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో జ‌మ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ లోహియా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

దీని వెనుక ఉగ్ర కోణం దాగి ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న షాహీర్ అహ్మ‌ద్ పాత్ర ఉన్న‌ట్లు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. దీని వెనుక టెర్ర‌రిస్ట్ కోణం దాగి ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు పుల్వామాలో భార‌త ఆర్మీ క్యాంపుపై టెర్ర‌రిస్టులు దాడికి పాల్ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న‌లో ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో జ‌వాన్ కు గాయాల‌య్యాయి. దీంతో కేంద్ర మంత్రి టూర్ భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. జైళ్ల శాఖ డీజీ హ‌త్య‌కు గురి కావ‌డంతో జ‌మ్మూ లోని రాజౌరిలో అమిత్ షా ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌లను నిలిపి(JK Internet Blocked) వేసింది కేంద్రం. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. కాగా ఈ హ‌త్య‌కు ఉగ్ర‌వాదుల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పోలీసులు నిర్దారించారు. కాగా గ‌త వారం రోజులుగా జ‌మ్మూ కాశ్మీర్ లో రెండు సార్లు ఉగ్ర‌దాడులు జ‌రిగాయి.

పారా మిల‌ట‌రీ సిబ్బంది జ‌మ్మూ కాశ్మీర్ లో ఆక‌స్మిన త‌నిఖీలు నిర్వ‌హించారు.

Also Read : పొన్నియిన్ సెల్వ‌న్ కాసుల వేట

Leave A Reply

Your Email Id will not be published!