Himachal Govt Withdraw : జర్నలిస్టులకు క్యారెక్టర్ సర్టిఫికెట్లా
ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న సర్కార్
Himachal Govt Withdraw : ఎట్టకేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తలవంచింది. విచిత్రం ఏమిటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జర్నలిస్టులకు అగ్ని పరీక్ష పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా టూర్ లో పాల్గొనే జర్నలిస్టులు ఎవరైనా సరే వారంతా క్యారెక్టర్ కలిగి ఉన్న సర్టిఫికెట్లు తమకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం దేశ మంతటా తీవ్ర నిరసన వ్యక్తమైంది. చివరకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే తాము జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఎలాంటి క్యారెక్టర్ సర్టిఫికెట్(Himachal Govt Withdraw) సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 29 నాటి ఉత్తర్వుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ , ఆల్ ఇండియా రేడియో జర్నలిస్టులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ లేఖపై హిమాచల్ ప్రదేశ్ పోలీస్ చీఫ్ సంజయ్ కుందు విచారం వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని కావాలని ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. మరో వైపు జర్నలిస్టులతో పాటు మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా జారీ చేసిన ఉత్తర్వుల్లో అన్ని ప్రెస్ కరస్పాండెంట్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు పాసులు జారీ చేయాలంటే క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలని కోరింది.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు బ్లాక్