Elon Musk : ట్విట్టర్ కొనుగోలుపై ఎలోన్ మస్క్ ఓకే
రోజు రోజుకు ట్విస్ట్ లు టెస్లా సిఇఓ, చైర్మన్
Elon Musk : ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మైక్రో బ్లాగింగ్ సంస్థగా పేరొందింది డోర్సే స్థాపించిన ట్విట్టర్. ప్రముఖ విద్యుత్ కార్ల సంస్థ టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ లో షేర్లను కొనుగోలు చేశారు. ఆపై ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు ట్విట్టర్ కు. $44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కైవసం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
ఆపై వరుసగా ట్విట్టర్ పై నోరు జారాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆపై తనకు ట్విట్టర్ లో అసలు ఖాతాదారులు ఎందరు ఉన్నారో, ఫేక్ ఖాతాదారులు ఎందరు ఉన్నారో వాస్తవాలతో కూడిన వివరాలు తెలియ చేయాలని ట్విట్టర్ ను కోరాడు.
దీనిపై ట్విట్టర్ జాబితా అందజేసినా దానిపై సంతృప్తి చెందలేదు ఎలోన్ మస్క్(Elon Musk). దీంతో తాను చేసుకున్న ఒప్పందం నుంచి నిష్క్రమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు.
దీనిపై ఎలోన్ మస్క్ కు ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య పెద్ద ఎత్తున యుద్దం కొనసాగింది. నిర్ణీత గడువు లోగా ట్విట్టర్ ను కైవసం చేసుకోక పోతే నష్ట పరిహారం ఇవ్వాలంటూ ముందుగానే ట్విట్టర్ తో చేసుకున్న ఒప్పందంలో స్పష్టం చేశాడు. ఇరువురి తరపున ఎంఓయూ చేసుకున్నారు. ఇరు వర్గాలు కోర్టుకు ఎక్కాయి.
ఒక్కో షేరును $54.20 చొప్పున లావాదేవీని ముగించడం కంపెనీ ముఖ్య ఉద్దేశమని ఎలోన్ మస్క్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా టెక్ సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలోన్ మస్క్ అంగీకరించినట్లు ట్విట్టర్ రెగ్యులేటర్లకు తెలిపింది. కాగా ఎలోన్ మస్క్ చేసిన ప్రకటన ఎంత మేరకు నమ్మ వచ్చనేది కీలకంగా మారనుంది.
Also Read : నాలుగు నగరాల్లో జియో 5జీ సేవలు