Shehbaz Sharif : ప్రపంచంలో ఇమ్రాన్ అతి పెద్ద దగాకోరు
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif : పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు. ఈ ప్రపంచంలో అతి పెద్ద దగాకోరు ఎవరంటే ఒక్క ఇమ్రాన్ ఖానే అంటూ ఎద్దేవా చేశాడు. ప్రధానిగా కొలువు తీరిన మాజీ పీఎం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని ఆరోపించాడు.
ఏప్రిల్ లో విజయవంతమైన అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడినప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ ఓటర్లను ప్రమాదకరంగా పోలరైజ చేసేందుకు సమాజంలోకి విషాన్ని చొప్పించారంటూ మండిపడ్డారు. అసంబద్ద విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుందన్నారు షెహబాజ్ షరీఫ్.
నిరంతరం అబద్దాలను ఆడడంలో ఆరి తేరాడని ఎద్దేవా చేశారు పాకిస్తాన్ పీఎం. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ పాకిస్తాన్ దేశీయ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి చేసిన నష్టం అంతా ఇంతా కాదన్నారు. సైఫర్ ఆడియో లీక్ లపై ప్రత్యేకంగా ప్రస్తావించాడు షెహబాజ్ షరీఫ్. సైఫర్ అనేది ఆరోపించిన దౌత్య కేబుల్.
ఇది యుఎస్ పరిపాలన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, దేశంలో పాలన మార్పును సులభతరం చేయాలని కుట్ర సిద్దాంతాలకు ఆజ్యం పోసిందన్న ఆరోపణలు ఉన్నాయి. తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను పీఎం పదవి నుంచి తప్పించేందుకు అమెరికా కుట్ర పన్నిందంటూ పార్టీ ఆరోపించింది.
యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారి డోనాల్డ్ లూతో అప్పటి రాయబారి అసద్ మజీద్ సమావేశం ఆధారంగా సెఫర్ రూపొందించబడింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ పీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : భారత్ తో బంధంపై ఉక్రెయిన్ ఫోకస్