RSS First Women : ఆర్ఎస్ఎస్ చ‌రిత్ర‌లో మ‌హిళ‌కు ఛాన్స్

ప‌ర్వ‌తారోహ‌కురాలికి అరుదైన గౌర‌వం

RSS First Women : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) త‌న సిద్దాంతానికి భిన్నంగా వెళుతోందా. ఆర్ఎస్ఎస్ ఏర్ప‌డి 100 ఏళ్ల‌వుతోంది. ప్ర‌తి ఏటా సంస్థ ఆధ్వ‌ర్యంలో విజ‌య ద‌శ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

అక్టోబ‌ర్ 5 బుధ‌వారం ద‌స‌రా పండుగను పుర‌స్క‌రించుకుని మ‌హారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జ‌రిగిన ఆర్ఎస్ఎస్ కార్య‌క్రమంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్.

ఈ సంద‌ర్భంగా ఇన్నేళ్ల సైద్ధాంతిక ఆర్ఎస్ఎస్(RSS First Women) సంస్థ‌లో ఒక మ‌హిళ‌ను అతిథిగా ఆహ్వానించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త దేశంలో ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని రెండు సార్లు అధిరోహించి చ‌రిత్ర సృష్టించారు సంతోష్ యాద‌వ్.

ఆమె 1992వ సంవ‌త్స‌రంలో, 1993లో ఎవ‌రెస్ట్ ను అధిరోహించారు. రెండుసార్లు అధిరోహించిన మ‌హిళ‌గా ఆమె ప్ర‌పంచ రికార్డును న‌మోదు చేసింది. ప‌ర్వ‌తా రోహ‌కురాలైన మ‌హిళ విజ‌య ద‌శ‌మి వేడుక‌ల‌కు హాజ‌రు కావ‌డం క‌ల‌క‌లం రేపింది.

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ త‌న సంప్ర‌దాయంలో మార్పును సూచిస్తూ మహిళ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం లేకుండా ఏ స‌మాజ‌మూ పురోగ‌తి సాధించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ అభివృద్దిలో స్త్రీలు కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని కొనియాడారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌.

పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఆయుధ పూజ కూడా చేశారు. జ‌నాభాపై స‌మ‌గ్ర విధానం కోసం పిలుపునిచ్చారు. ఇది అంద‌రికీ స‌మానంగా వ‌ర్తింప చేయాల‌న్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్.

Also Read : నితీశ్ పార్టీ చీఫ్ గా ఉండ‌మ‌న్నారు – పీకే

Leave A Reply

Your Email Id will not be published!