Amit Shah : ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదు – అమిత్ షా
జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ది చేస్తాం
Amit Shah : జమ్మూ కాశ్మీర్ లోనే కాదు దేశంలో ఎక్కడా ఉగ్రవాదం ఉన్నా సహించే ప్రసక్తి లేదన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా లేమని ప్రకటించారు. రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు.
ఇంత కాలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం అల్లకల్లోలాకు పరక్షోంగా సపోర్ట్ చేస్తూ వచ్చారని నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్ర మూలాలను, నేరాలను, హింసను తాము సహించ బోమన్నారు. జమ్మూ కాశ్మీర్ ను దేశంలోనే అత్యంత శాంతియుత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు అమిత్ చంద్ర షా.
ఇందు కోసం తాము ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభిస్తామన్నారు. బారాముల్లాలో బీజేపీ చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. 1990 నుంచి ఏకంగా జమ్మూ కాశ్మీర్ లో 42 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని దీనికంతటికి ఉగ్రవాదులే కారణమని పేర్కొన్నారు.
ఇంత మందిని పొట్టన పెట్టుకున్న వారు ఏం సాధించారు. ఎవరికైనా ప్రయోజనం నెరవేరిందా అని ప్రశ్నించారు. తమ భూభాగాన్ని ఎవరైనా టచ్ చేయాలని చూసినా తాము ఊరుకోబోమన్నారు.
1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎక్కువ కాలం జమ్మూ కాశ్మీర్ ను అబ్దుల్లాలు, ముఫ్తీలు , నెహ్రూ గాంధీ కుటుంబాలు పాలించాయని ఇలా ఈ ప్రాంతం అల్లకల్లోలం జరిగేందుకు కారణమయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు అమిత్ చంద్ర షా(Amit Shah).
కొందరు పాకిస్తాన్ తో మాట్లాడాలని అంటున్నారు. డోంట్ కేర్. బారాముల్లా వాసులతో, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం. కానీ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవన్నారు అమిత్ షా.
Also Read : మాజీ సీఎం గృహ నిర్బంధం