Revanth Reddy : కేసీఆర్ బీఆర్ఎస్ పై మిశ్రమ స్పందన
రేవంత్ రెడ్డి, బీజేపీ తీవ్ర ఆగ్రహం
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది.
ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఎంఐఎం, జేడీఎస్, ఆర్జేడీ, తదితర పార్టీలు అభినందనలు తెలిపాయి. ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో పాలన చేత కాక ఇప్పుడు కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారంటూ మండిపడ్డారు. తాను సంపాదించిన వేల కోట్ల రూపాయలను దాచుకునేందుకే కొత్త పార్టీ పెట్టారంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినంత మాత్రాన కేసీఆర్ ను ఎవరూ నమ్మరన్నారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే కొత్త పార్టీ పల్లవి అందుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్(CM KCR) జాతీయ పార్టీ ప్రకటన పూర్తిగా దురుద్దేశ పూర్వకమైనదిగా పేర్కొన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్. ప్రభుత్వం పీకల లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క సమస్యకు పరిష్కారం దొరికిన పాపాన పోలేదన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఉన్నా ఈరోజు వరకు దేశంలో విస్తరించ లేదన్నారు.
అన్నాడీఎంకే, డీఎంకే, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు ఉన్నా వాటికి అంత సీన్ లేదన్నారు. రాజకీయ దురాశను నెరవేర్చుకునేందుకు ఇలా చేశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కేసీఆర్ పై.
Also Read : దేశమంతటా బీఆర్ఎస్ జెండా ఎగరాలి