Congress Chief Poll : శ‌శి థ‌రూర్ పై కేర‌ళ కాంగ్రెస్ కామెంట్స్

తిరువ‌నంత‌పురం ఎంపీ కంటే ఖ‌ర్గే బెట‌ర్

Congress Chief Poll : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో ఉన్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది కేర‌ళ కాంగ్రెస్ పార్టీ. పార్టీ చీఫ్ ఎంపిక‌కు సంబంధించి అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌లు(Congress Chief Poll) జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 19న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి రిజ‌ల్ట్ ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని అధికారికంగా డిక్లేర్ చేశారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. శ‌శి థ‌రూర్ కంటే మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బెట‌ర్ ఛాయిస్ అని పేర్కొన్నారు కేర‌ళ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా శ‌శి థ‌రూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో టాప్ లీడ‌ర్ గా కొన‌సాగుతున్నారు.

ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా జి23 అస‌మ్మ‌తి టీంలో ఒక స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం న‌బీ ఆజాద్ రిజైన్ చేశారు. కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి వ‌ర‌కు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ కొన‌సాగింది.

ఇదిలా ఉండ‌గా కేర‌ళ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎంపీలు కె. సుధాక‌ర‌న్ , కె. ముర‌ళీధ‌ర‌న్ ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) పై పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాము త‌మ అభిప్రాయాల‌ను మాత్ర‌మే తెలియ చేస్తున్నామ‌ని ఎవ‌రికి ఓటు వేయాలో పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రికీ స్వేచ్ఛ ఉంద‌న్నారు. మిగ‌తా పార్టీలలో కంటే కాంగ్రెస్ పార్టీలో డెమోక్ర‌సీ ఎక్కువ‌గా ఉంద‌న్నారు.

Also Read : త‌ల్లి షూలేస్ స‌వ‌రించిన రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!