Punjab CM Tribute : సిక్కు ఫ్యామిలీ హత్యపై సీఎం దిగ్భ్రాంతి
విదేశాంగ శాఖ మంత్రికి విన్నపం
Punjab CM Tribute : యుఎస్ లో కిడ్నాప్ కు గురైన నలుగురు సభ్యులతో కూడిన సిక్కు కుటుంబం చివరకు దారుణ హత్యకు గురైంది. ఓ తోటలో లభించిన మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎనిమిది నెలల పసిపాపతో సహా నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిక్కు ఫ్యామిలీ దారుణ హత్యపై స్పందించారు పంజాబ్ సీఎం(Punjab CM Tribute) భగవంత్ మాన్ . ఈ మేరకు ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రవాస భారతీయ సిక్కు ఫ్యామిలీని సురక్షితంగా స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కు విన్నవించారు.
వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా సిక్కు కుటుంబం పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా తాండా బ్లాక్ లోని హర్సీ పిండ్ కు చెందినది. నలుగురు సిక్కు కుటుంబ సభ్యుల హత్యపై పంజాబ్ సీఎం మాన్ గురువారం విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మృతులలో ఎనిమిది నెలల చిన్నారి అరుహి ధేరితో పాటు 36 ఏళ్ల జస్డీప్ సింగ్ , 27 ఏళ్ల జస్లీన్ కౌర్ , పాప మామ 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ గా గుర్తించారు. కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుందని సదరు కుటుంబం ఇక్కడికి వచ్చేందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
Also Read : కిడ్నాపైన ఎన్నారై ఫ్యామిలీ దారుణ హత్య