Kerala CM : డ్ర‌గ్ మాఫియాపై ఉక్కుపాదం – విజ‌య‌న్

డ్ర‌గ్ వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభించిన సీఎం

Kerala CM : కేర‌ళ‌ల‌లో డ్రగ్ మాఫియా పెచ్చ‌రిల్లి పోతుంద‌ని దానిని నియంత్రించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్. గురువారం కేర‌ళ రాష్ట్రంలో డ్ర‌గ్ వ్య‌తిరేక ప్రాచారాన్ని సీఎం ప్రార‌భించారు. ఈ సంద‌ర్భంగా తాను డ్ర‌గ్ మాఫియాకు వ్య‌తిరేకంగా పోరాడుతాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. డ్ర‌గ్ కొరియ‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను దేశ వ్య‌తిరేక శ‌క్తులుగా ప‌రిగ‌ణించే సంస్కృతిని పెంపొందించు కోవాల‌ని పిన‌ర‌య్ విజ‌య‌న్(Kerala CM) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు నెల రోజుల పాటు నో టు డ్ర‌గ్స్ ప్ర‌చారాన్ని గురువారం ప్రారంభించారు.

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేరళ సీఎం. తాము ఒక్క సెక‌న్ కూడా వృధా చేయ‌బోమ‌న్నారు. డ్ర‌గ్స్ పై పోరాటంలో తాము విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు విజ‌య‌న్. ప్ర‌స్తుతం ఆయ‌న యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. డ్రైవ్ బ‌హుముఖంగా ఉంటుంద‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే అన్ని ఏజెన్సీలు సంయుక్తంగా ప‌ని చేస‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు పిన‌ర‌యి విజ‌య‌న్.

డ్ర‌గ్ కొరియ‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను దేశ వ్య‌తిరేక శ‌క్తులుగా భావించే సంస్కృతిని పెంపొందించు కోవాల‌ని విజ‌య‌న్ పిలుపునిచ్చారు. మ‌త సంస్థ‌లు, నివాస సంఘాలు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు.

నెల రోజుల పాటు జ‌రిగే ప్ర‌చారంలో భాగంగా పాఠ‌శాల‌లు, కాలేజీల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి డ్ర‌గ్స్ పై ప్ర‌తిజ్ఞ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 24న అన్ని బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో దీపాల‌ను వెలిగిస్తారు.

Also Read : కన్న‌డ నాట బీజేపీ ప‌త‌నం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!