Gyanvapi Case : 11 లోగా సమాధానం ఇవ్వాలి – కోర్టు
జ్ఞాన్ వాపి కేసుపై కీలక కామెంట్స్
Gyanvapi Case : యూపీలోని జ్ఞాన్ వాపి కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 11 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది వారణాసి కోర్టు. ఇందులో భాగంగా తీవ్ర అభ్యంతరం తెలిపిన ముస్లిం పక్షం తమ అభ్యంతరాలు ఏవైనా ఉంటే తమకు తెలియ చేయాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 22న వారణాసి జిల్లా కోర్టు జ్ఞాన్ వాపి(Gyanvapi Case) మసీదు యాజమాన్యాన్ని కాంప్లెక్స్ లోపట కనుగొనబడిన శివ లింగం అని చెప్పే నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను తెలియ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా హిందూ పిటిషనర్లు ఈ నిర్మాణం శివలింగం అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టులో విచారణ ప్రారంభమైంది.
ఏమైనా ఇందుకు గాను అభ్యంతరాలు వుంటే వెంటనే తెలియ చేయాలని సూచించింది. జ్ఞాన్ వాపి మసీదు కాంపౌండ్ , గోడలు, మసీదు కాంప్లెక్స్ లోని ఇతర నిర్మాణాలపై కనుగొనబడిన శివలింగం లాంటి నిర్మాణాన్ని కార్బన్ డేటింగ్ కోసం అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను జిల్లా న్యాయూమర్తి అజయ్ కృష్ణ విశ్వేస్ స్వీకరించారు.
ఆ తర్వాత కోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై దాఖలు చేసిన పిటిషన్ ను ఐదుగురు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన రాఖీ సింగ్ స్పందిస్తూ శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయడం మత వ్యతిరేక చర్య , హిందువుల భావాలు, విశ్వాసాలను అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు.
Also Read : చిరుతల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్