Rahul Gandhi : ఇంకెన్నాళ్లీ రైతుల ఆత్మహత్యలు
కర్ణాటక సర్కార్ పై రాహుల్ కన్నెర్ర
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కన్నడ నాట రైతు ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసలు రాష్ట్రంలో ఇంకెంత కాలం ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రశ్నించారు.
దేశంలో మోదీ ప్రభుత్వం కొలువుతీరాక వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. దీనికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్ని నిర్ణయాలేనంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఆయన ప్రధానంగా కర్ణాటక రైతు ఆత్మహత్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మాండ్యా లోని బ్రహ్మదేవర హళ్లి గ్రామంలో యాత్ర ప్రవేశించిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఈ దేశంలో రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఒకరు పేదలు మరొకరు వ్యాపారులని మండిపడ్డారు. రోజు రోజుకు ప్రజలు మోదీ పాలన పట్ల విసుగు చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త రైతును కోల్పోయిన ఒక మహిళను తాను కలిశానని అన్నారు. రూ. 50,000 అప్పు తీర్చ లేక తన భర్త సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ తన స్నేహితులకు కేవలం 6 శాతానికి వడ్డీకి రుణాలు ఇస్తారు. కానీ అన్నం పెట్టే రైతులకు 24 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ఈరోజు వరకు ఆదుకున్న పాపాన పోలేదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : 11 లోగా సమాధానం ఇవ్వాలి – కోర్టు