Gauri Lankesh Family : రాహుల్ యాత్ర‌లో గౌరీ లంకేష్ ఫ్యామిలీ

క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న జోడో యాత్ర

Gauri Lankesh Family : క‌ర్ణాట‌క‌లో హిందుత్వ వాదుల చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన ర‌చ‌యిత గౌరీ లంకేష్(Gauri Lankesh Family) కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రలో పాల్గొన్నారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభ‌మై కేర‌ళ‌లో ముగిసింది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ప్ర‌వేశించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు వందల కిలోమీట‌ర్ల మేర యాత్ర సాగింది. యాత్రలో గౌరీ లంకేష్ ఫ్యామిలీ చేర‌డంపై కీల‌క కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. గౌరీ లంకేష్ కు తాము అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. హ‌క్కుల ఉద్య‌మ‌కార‌ణి, ర‌చ‌యిత్రి గౌరీ లంకేశ్ త‌ల్లి, సోద‌రితో క‌లిసి యాత్ర‌లో న‌డిచారు.

బార‌త్ జోడో యాత్ర లంకేష్ లాంటి వారి గొంతుక అని దానిని ఎప్ప‌టికీ మూయించ లేర‌న్నారు రాహుల్ గాంధీ. గౌరీ లంకేష్ స‌త్యం కోసం నిల‌బ‌డింద‌న్నారు. ధైర్యం ప‌క్షాన మాట్లాడింద‌న్నారు. గౌరీ లంకేష్ ఆశ‌యాల సాధ‌న కోసం తాను పాటు ప‌డ‌తాన‌ని చెప్పారు రాహుల్ గాంధీ. లంకేష్ , ఆమె వంటి అసంఖ్యాక‌మైన ఇత‌రుల కోసం తోడ్పాటు అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో రాహుల్ గాంధీ ఈ యాత్ర గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అదేమిటంటే ఆయ‌న గౌరీ లంకేష్ త‌ల్లి, సోద‌రితో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఇది ఎప్ప‌టికీ నిశ్శ‌బ్దం కాద‌న్నారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర 3,570 కిలోమీట‌ర్ల మేర సాగుతుంది.

150 రోజుల పాటు జ‌రుగుతుంది. ఇది కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది.

Also Read : నాసిక్ బ‌స్సులో మంట‌లు 11 మంది మృతి

Leave A Reply

Your Email Id will not be published!