Ashok Gehlot : గౌతం అదానీపై అశోక్ గెహ్లాట్ కితాబు
రాజస్థాన్ సీఎం తీరుపై అంతటా విస్మయం
Ashok Gehlot : ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరొందిన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీపై ప్రశంసల జల్లులు కురిపించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు అదానీ. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. గౌతమ్ అదానీని గౌతమ్ భాయ్ అని కితాబు ఇచ్చాడు.
వ్యాపారవేత్త వ్యాపార చతుర, సామాజిక సంక్షేమ పథకాలను ప్రశంసించాడు. ఇదిలా ఉండగా రాజస్థాన్ లో బారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పర్యటించిన గౌతమ్ అదానీ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తో భేటీ అయ్యారు. ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలో రూ. 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని వెల్లడించారు.
ఇందులో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, సిమెంట్ ప్లాంట్ ను విస్తరించడం, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో అప్ గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి. ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022 సమ్మిట్ లో ఈ ప్రకటన చేశారు గౌతమ్ అదానీ.
భవిష్యత్తు పెట్టుబడులను కలిపి రాబోయే ఐదు నుండి ఏడు ఏళ్లలలో ఈ పనులను తాము చేపట్టున్నట్లు పేర్కొన్నారు గౌతమ్ అదానీ. ఈ భారీ పెట్టుబడుల ద్వారా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, వసతుల కల్పనలో 40,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు భారతీయ వ్యాపారవేత్త.
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరో రెండు ప్రాజెక్టులపై పని చేస్తుందన్నారు అదానీ. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రం వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తున్నారు.
Also Read : రాహుల్ యాత్రలో గౌరీ లంకేష్ ఫ్యామిలీ