Mallikarjun Kharge : సోనియా చేతిలో రిమోట్ లేదు – ఖ‌ర్గే

సీనియ‌ర్ నేత సీరియ‌స్ కామెంట్స్

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు సోనియా గాంధీ చేతిలో పార్టీ ఏమీ లేద‌న్నారు. ఆమె చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంద‌న్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు ఎంపీ.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న‌కు తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ప్ర‌ధాన పోటీదారుగా ఉన్నారు. అక్టోబ‌ర్ 17న అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 19న రిజ‌ల్ట్ డిక్టేర్ చేస్తారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. తాను గెలుపొందినా సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ‌ను కాబోనంటూ ప్ర‌క‌టించారు.

ఒక‌వేళ ఖ‌ర్గే గెలుపొందితే ఆయ‌న చేతిలో పార్టీ ఏమీ ఉండ‌ద‌ని భార‌తీయ జ‌నతా పార్టీ ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుజ‌రాత్ లోని మ‌హాత్మా గాంధీ స‌బ‌ర్మతి ఆశ్ర‌మాన్ని సందర్శంచారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు.

పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని ఇత‌ర పార్టీల‌లో అలాంటిది ఏమీ లేద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌శ్నించే, పోటీ చేసే హ‌క్కు ఉంద‌న్నారు. ఒక‌వేళ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే రిమోట్ కంట్రోల్ త‌న వద్దే ఉంటుంద‌ని మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త‌

మ పార్టీలో రిమోట్ కంట్రోల్ అంటూ ఏమీ లేద‌ని అదంతా విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లుగా కొట్టి పారేశారు. ఎవ‌రినైనా పోటీ చేయ‌ద్దంటూ కోరే హ‌క్కు నాకు లేదు. పార్టీలో చాలా మంది త‌న‌ను పోటీ చేయ‌మ‌ని కోరారు. అందుకే బ‌రిలో ఉన్నాన‌ని పేర్కొన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

Also Read : హిందీ జాతీయ భాష‌పై రాహుల్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!