Komatireddy Rajgopal Reddy : బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో డిక్లేర్
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికల తేదీ ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హైకమాండ్ శనివారం తమ పార్టీ అభ్యర్థిగా ఇటీవలే చేరిన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిని శనివారం ప్రకటించింది.
ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేకు రాజీనామా చేశారు. దీంతో నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy) బీజేపీలో అమిత్ షా సారథ్యంలో చేరారు.
దేశంలోని ఆరు రాష్ట్రాలలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు వ్యూహాలు కదుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివంగత కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురును తమ అభ్యర్థిగా ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ తో శుక్రవారం అక్టోబర్ 7న ఎన్నికల నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇవి అక్టోబర్ 14 వరకు కొనసాగుతాయి. వచ్చే నెల నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డిని బరిలోకి దింపింది
కాగా ఆగస్టు 8న తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Also Read : సేవకు పురస్కారం అభినందించిన సీఎం