KTR : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్ నెలలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
హైదరాబాద్ లోని దండుమల్కాపురం లోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో దీనిని ఏర్పాటు చేశారు. అత్యంత విశాలమైన , అన్ని వసతి సౌకర్యాలతో కూడుకున్న నైపుణ్య శిక్షణ కేంద్రం ( స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ) డిసెంబర్ 2022 నాటి కల్లా పూర్తి అవుతుందని వెల్లడించారు.
ఈ విషయాన్ని తెలియ చేసేందుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు అందులో స్థానిక నిరుద్యోగులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యం కూడా ఇదేనని ప్రకటించారు.
547 ఎకరాల్లో విస్తరించి 589 ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు వీలుగా దీనిని ఏర్పాటు చేశామని తెలిపారు కేటీఆర్(KTR). దండుమల్కాపురం ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే గ్లోబల్ వైడ్ గా హైదరాబాద్ కు ఎనలేని పేరుందన్నారు. ఐటీ పరంగా గతంలో సిలికాన్ వ్యాలీ అని బెంగళూరుకు పేరుందని, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదని పేర్కొన్నారు కేటీఆర్. దేశానికే తెలంగాణ ఐటీ పరంగా నిలిచిందన్నారు. ప్రతి చోటా తెలంగాణలోని పలు పట్టణాలలో కూడా ఐటీని విస్తరించేందుకు కృషి చేశామని తెలిపారు.
Also Read : బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి