LG Saxena : ప్రకటనలకే ఢిల్లీ సర్కార్ పరిమితం – ఎల్జీ
ప్రసంగాలతో ప్రభుత్వ పాలన ఎలా
LG Saxena : ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(LG Saxena) మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే మద్యం పాలసీపై విచారణకు ఆదేశించారు. సీబీఐ కేసు నమోదు చేస్తే ఈడీ రంగంలోకి దిగింది. మరో వైపు విద్యుత్ సబ్సిడీపై కూడా విచారణ చేపట్టాలని సూచించారు.
నివేదిక ఇవ్వాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇదంతా రాజకీయ కుట్ర కోణంతోనే వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీనిపై ఎల్జీ సక్సేనా సీరియస్ గా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. పదే పదే తనను టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ , తన మంత్రులు తమ బాధ్యతల నుంచి పారి పోయారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన లేఖను విడుదల చేశారు వినయ్ కుమార్ సక్సేనా. ప్రకటనలు గుప్పించడం, ప్రసంగాలతో హోరెత్తించడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.
అంతే కాదు ప్రభుత్వ పాలనను గాలికి వదిలి వేశారంటూ మండిపడ్డారు. ఇలా అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన విధులు, బాధ్యతల నుంచి పారి పోయారంటూ ఎద్దేవా చేశారు. ఆప్ ప్రభుత్వ పనితీరులో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ వినయ్ కుమార్ సక్సేనాపై(LG Saxena) డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
దీనిపై స్పందిస్తూ లేఖ విడుదల చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనిపై స్పందించారు అరవింద్ కేజ్రీవాల్. ఇది మరో ప్రేమ లేఖ అని పేర్కొన్నారు.
Also Read : ఆప్ మహిళా ఎమ్మెల్యే పెళ్లి వైరల్