PM Modi : గుజరాత్ లో పీఎం నరేంద్ర మోదీ బిజీ
రూ. 14,600 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు రూ. 14,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అంతే కాకుండా మరికొన్ని కోట్ల రూపాయలతో చేపట్టనున్న కార్యక్రమాలకు శంకుస్థాపన చూడా చేయనున్నారు ప్రధానమంత్రి.
మోధేరా గ్రామంలో సుమారు రూ. 3,900 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇంకొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. అంతే కాకుండా మోధేరాను భారత దేశంలో మొట్ట మొదటి సారిగా 24×7 సౌరశక్తితో పని చేసే గ్రామంగా ప్రకటిస్తారు నరేంద్ర మోదీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇవాళ ఉదయం ప్రారంభోత్సవాల అనంతరం ప్రసంగిస్తారు. సాయంత్రం మోధేరాలో ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకు ముందు పీఎం మోధేశ్వరి మాత ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. సూర్య మందిరాన్ని కూడా సందర్శిస్తారు.
రౌండ్ ది క్లాక్ సౌర శక్తితో పని చేసే గ్రామంగా మోధేరాను తయారు చేయడంలో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ , రెసిడెన్షియల్ , ప్రభుత్వ భవనాలపై 1,300 కంటే ఎక్కువ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ లను అభివృద్ది చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సోమవారం ప్రధానమంత్రి భరూచ్ జిల్లా లోని అమోద్ లో బస చేస్తారు. అక్కడ ఆయన రూ. 8,000 కంటే ఎక్కువ విలువైన వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
Also Read : అదానీ పెట్టుబడులను వ్యతిరేకిస్తాం