Bhupender Yadav : మునుగోడులో గెలుపు బీజేపీకి మ‌లుపు

కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్

Bhupender Yadav : మునుగోడు ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ గెల‌వ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్(Bhupender Yadav). త‌మ పార్టీ అభ్య‌ర్థిగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని ప్ర‌క‌టించింది బీజేపీ. ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉన్న‌ట్టుండి బీజేపీలోకి జంప్ అయ్యారు.

దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. న‌వంబ‌ర్ 3న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా ఇక్క‌డ ప‌లువురు పోటీ చేస్తున్నా ప్ర‌ధానంగా పోటీ మాత్రం ముగ్గురి మ‌ధ్యే ఉంది. బీజేపీ నుంచి రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూచుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఉన్నారు.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ చాప‌కింద నీరులా ప్ర‌చారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ నియోక‌వ‌ర్గం కంచుకోట‌గా ఉంది. మ‌రో వైపు బీజేపీకి పార్టీ ప‌రంగా కేడ‌ర్ లేక పోయినా కేవ‌లం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌క్తిగ‌త చ‌రిష్మాను న‌మ్ముకుని బ‌రిలోకి దిగింది. ఒక ర‌కంగా చెప్పాలంటే పార్టీల మ‌ధ్య కంటే వ్య‌క్తుల మ‌ధ్యే పోటీ నెల‌కొంద‌న్న‌ది వాస్త‌వం.

ప్ర‌చారంలో మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఈటెల రాజేంద‌ర్ , వివేక్, త‌దిత‌ర నేత‌లంతా ఇక్క‌డే మ‌కాం వేశారు. పార్టీ శ్రేణుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే ల‌బ్ది పొందింద‌ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్ ఆరోపించారు.

Also Read : ప్ర‌చారానికి కోమ‌టిరెడ్డి దూరం

Leave A Reply

Your Email Id will not be published!