Russian Missiles : ఉక్రెయిన్ పై ర‌ష్యా మిస్సైళ్ల మోత

14 మంది మృతి చెందార‌న్న ఉక్రెయిన్

Russian Missiles : యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకున్నా ర‌ష్యా మంకుప‌ట్టు వీడ‌డం లేదు. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. మిస్సైళ్లను ప్ర‌యోగిస్తోంది. ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 84 క్షిప‌ణుల‌ను(Russian Missiles) ప్ర‌యోగించింద‌ని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ వెల్ల‌డించారు.

దీనిని ధ్రువీక‌రించారు ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. ఈ మిస్సైళ్ల ఎడ తెరిపి దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది పౌరులు చ‌ని పోయిన‌ట్లు ప్ర‌క‌టించింది ఉక్రెయిన్. ర‌ష్యా నుంచి క్రిమియాకు క‌లిపే వంతెన (బ్రిడ్జి)పై భారీ పేలుడు సంభ‌వించింది.

ఈ ఘ‌ట‌న‌కు పూర్తి కార‌ణం ఉక్రెయిన్ అని భావించింది ర‌ష్యా. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. సంఘ‌ట‌న చోటు చేసుకున్న మ‌రుస‌టి రోజు నుంచే వ‌రుస దాడుల‌తో బెంబెలెత్తించింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కైవ్ పూర్తిగా దాడుల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఎక్క‌డ చూసినా హాహాకారాలు, పొగ‌ల‌తో నిండి పోయింది.

మిస్సైళ్ల దాడుల్లో చాలా మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పూర్తిగా దెబ్బ‌తింది కైవ్. వాహ‌నాలు, భ‌వంతులు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఉక్రెయిన్ ప్ర‌ధాన‌మంత్రి డెనిస్ ష్మిగ‌ల్ ప్ర‌కారం ఎనిమిది ప్రాంతాలు, కైవ్ లో 11 ముఖ్య‌మైన మౌలిక స‌దుపాయాలు దెబ్బ‌తిన్నాయి.

తాత్కాలికంగా క‌రెంట్, నీరు, క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా మ‌రిన్ని దాడులు ముమ్మ‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు ర‌ష్యా డిప్యూటీ హెడ్ మెద్వెదేవ్.

ఇదిలా ఉండ‌గా బెలార‌స్ నుండి ఇరాన్ త‌యారు చేసిన డ్రోన్ ల‌ను దాడుల‌కు ఉప‌యోగించిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ.

Also Read : స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తే ఎలా – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!