Mallikarjun Kharge : మేడం ఆశీర్వాదం లేదు – ఖ‌ర్గే

సోనియా గాంధీ నా పేరు సూచించ లేదు

Mallikarjun Kharge :  కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు మ‌ల్లికార్జున్ ఖర్గే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న పేరును ఏనాడూ పార్టీ ప‌రంగా చీఫ్ కోసం సూచించ లేద‌ని స్ప‌ష్టం చేశారు. అదంతా పూర్తిగా అబ‌ద్ద‌మంటూ కొట్టి పారేశారు. పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని ఇత‌ర పార్టీల‌లో అలాంటి వాతావ‌ర‌ణం లేద‌ని బీజేపీని ఉద్దేశించి ఆరోపించారు ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఇదిలా ఉండ‌గా మొద‌ట రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ సీఎంలు క‌మ‌ల్ నాథ్ , దిగ్విజ‌య్ సింగ్ పేర్లు వినిపించాయి. త‌ర్వాత అనూహ్యంగా క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేరు వినిపించింది. చివ‌ర‌కు సోనియా గాంధీ ఆమె పేరును రిఫ‌ర్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మ‌రో వైపు అస‌మ్మ‌తి టీంకు చెందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పోటీదారుగా ఉన్నారు.

ఇద్ద‌రూ విస్తృతంగా ప‌ర్య‌టిస్త‌న్నారు. ఈనెల 17న అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 19న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన 9,000 మంది స‌భ్యులు ఇద్ద‌రిలో ఎవ‌రినో ఒక‌రిని ఎన్నుకుంటారు. ప్ర‌చారంలో ఇద్ద‌రూ బిజీగా మారారు. ఎవ‌రికి వారు ప్ర‌చారంలో మునిగి పోయారు.

యూపీ ప్ర‌స్తుతం ప‌ర్య‌టిస్తున్నారు ఖర్గే. ఈ సంద‌ర్భంగా ల‌క్నోలో ఖ‌ర్గే మాట్లాడారు. త‌న‌కు ఏనాడూ సోనియా గాంధీ స‌పోర్ట్ చేయ‌లేద‌న్నారు. పార్టీలో స‌మిష్టి నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌న్నారు. పోటీ అన్న‌ది స‌హ‌జ‌మేన‌ని శ‌శి థ‌రూర్(Shashi Tharoor) త‌న‌కు సోద‌రుడు లాంటి వాడ‌ని పేర్కొన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ ను అమ‌లు చేస్తాన‌ని చెప్పారు ఖ‌ర్గే.

Also Read : కేంద్రం తీరుపై వైగో..అళ‌గిరి క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!