Covid19 : పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో ప‌రేషాన్

24 గంట‌ల్లో 2,139 కొత్త కోవిడ్ కేసులు

Covid19 : ఒక రోజు త‌గ్గుతూ మ‌రో రోజు పెరుగుతూ ప‌రేషాన్ చేస్తోంది క‌రోనా. రోజు రోజుకు దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,139 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు.

యాక్టివ్ కేసుల‌తో క‌లుపుకుంటే మొత్తం 26,292 కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,082 కేసులు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డం విశేషం. తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లుపుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కోవిడ్ -19 కేసుల(Covid19) సంఖ్య 4,46,18,533కి చేరింది.

ఇక కేసుల‌కు సంబంధించి యాక్టివ్ కేసులు 26,292కి త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది. మొత్తం క‌రోనా కార‌ణంగా 12 మర‌ణాలు సంభావించాయ‌ని పేర్కొంది.

వీటితో క‌లుపుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,28,835కి చేరుకుంది. ఇందులో కేర‌ళ‌లో న‌లుగురు క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక మొత్తం ఇన్ ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉండ‌గా జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.76 శాతానికి పెరిగింద‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌కారం రోజూ వారీ సానుకూల‌త రేటు 0.81 శాతంగా ఉండ‌గా వారాంత‌పు అనుకూల‌త రేటు 1.13 శాతంగా న‌మోదైంది. ఇక వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 4,40,63,406కు పెరిగింది.

కాగా మ‌ర‌ణాల రేటు శాతం 1.19 శాతంగా న‌మోదు కావడం విశేషం. మ‌రో వైపు క‌రోనా క‌ట్ట‌డికి గాను కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 219.09 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

Also Read : హిందీ ప్యాన‌ల్ నివేదిక‌పై కేర‌ళ సీఎం ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!