Shashi Tharoor : ఎన్నికల ప్రచారంలో శశి థరూర్ బిజీ
గుజరాత్ లో పర్యటించనున్న ఎంపీ
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దూకుడు పెంచారు. ఆయన అసమ్మతివాదిగా ముద్ర పడినా ప్రజాస్వామ్యం కోసం తాను బరిలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు తన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. తాను గెలుపొందితే పార్టీలో హైకమాండ్ కల్చర్ అంటూ ఉండదన్నారు.
వికేంద్రీకరణ చేస్తానని, ఒక్కరికి ఒకే పదవి అన్నది కచ్చితంగా అమలు అయ్యేలా చేస్తానని ప్రకటించారు. అంతే కాకుండా ఆయా రాష్ట్రాల చీఫ్ ల టెర్మ్ కు సంబంధించి కేవలం 2 ఏళ్లకు మాత్రమే పరిమితం చేస్తానని వెల్లడించారు. ఈ తరుణంలో మరో వైపు తనకు పోటీదారుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఇంకో వైపు శశి థరూర్ సైతం నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ ను ముమ్మరం చేశారు. బుధవారం గుజరాత్ లో పర్యటించేందుకు వచ్చారు. సబర్మతీ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించం ద్వారా శశి థరూర్(Shashi Tharoor) తన పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ లో కాంగ్రెస్ ప్రతినిధులు, మీడియాతో సంభాషించనున్నారు.
ఈనెల 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెలువడుతాయి. పార్టీలో డెమోక్రసీ ఉండాలన్నదే తన అభిమతమని ఆయన పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా శశి థరూర్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా గత వారం మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ లో పర్యటించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక హీట్ పెంచుతోంది పార్టీలో.
Also Read : మేడం ఆశీర్వాదం లేదు – ఖర్గే