Ashok Gehlot : ‘ఇందిరా రసోయ్’ ని రుచి చూడండి – సీఎం
ప్రజా ప్రతినిధులకు అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : రాజస్థాన్ ప్రభుత్వం పేదల కడుపు నింపేదుకు ఇందిరా రసోయ్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. మెరుగైన పౌష్టికాహారం, రుచికరమైన భోజనాన్ని ఇందులో అందజేస్తారు. దీని ధర రూ. 8 మాత్రమే. ఈ సందర్భంగా ఇందిరా రసోయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం అశోక్ గెహ్లాట్.
నాణ్యతను కాపాడుకునేందుకు ఇందిరా రసోయ్ వద్ద నెలకు ఒకసారి తినాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సూచించారు సీఎం. పౌష్టికాహారం, రుచికరమైన భోజనాన్ని అందించే పథకాన్ని మెరుగ్గా పర్యవేక్షించేందుకు ఇందిరా రసోయ్ వద్ద భోజనం చేయాలని ప్రజా ప్రతినిధులతో పాటు మేయర్లు, కౌన్సిలర్లు , ఇతర ప్రజాప్రతినిధులకు విన్నవించారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
కనీసం నెలకు ఒకసారి పరీక్షించాలని కోరారు. దీని వల్ల ప్రజలతో మరింత అనుబంధాన్ని పెంచుతుందన్నారు సీఎం. ఈ పథకం కింద ఒక్కో ప్లేట్ కు రూ. 8 చొప్పున ఆహారం అందజేస్తారు. ఇదిలా ఉండగా ఆహార నాణ్యతను పరీక్షించేందుకు భోజనం తినాలని కోరారు సీఎం. ప్రజలతో సంబంధాలు మెరుగు పడటమే కాకుండా సమాజానికి చెందిన భావనను కూడా పెంచుతుందన్నారు.
ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోందన్నారు అశోక్ గెహ్లాట్. గత నెలలో జోధ్ పూర్ లోని ఇందిరా రసోయ్ లో తాను , అసెంబ్లీ స్పీకర్ , కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి కూపన్లు పొంది భోజనం చేశామని చెప్పారు సీఎం. ఇప్పటి వరకు 7.42 కోట్ల మందికి ఆహారం అందించామని తెలిపారు.
ప్రస్తుతం రాజస్థాన్ లో ప్రవేశ పెట్టిన ఈ పథకం జనాదరణ పొందుతోంది. మంచి మార్కులు కూడా పడ్డాయి గెహ్లాట్ కు.
Also Read : దగ్గు సిరప్ ల ఉత్పత్తి నిలిపివేత