JIO 5G I Phone12 : స్పీడ్ లో జియో..ఐఫోన్ 12 హవా
ఊక్లా సర్వేలో ఆసక్తికర అంశం వెల్లడి
JIO 5G I Phone12 : దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది 5జీ గురించి. స్పెక్ట్రమ్ వేలం పాట పూర్తి కావడంతో టెలికాం కంపెనీలు రంగంలోకి దిగాయి. రిలయన్స్ సంస్థ జియో తో పాటు ఎయిర్ టెల్, వొడా ఫోన్ , ఐడియా టెలికాం ఆపరేటర్లు 5జీ సేవలు అందించడంలో ఫోకస్ పెట్టాయి.
ఇప్పటికే నాలుగు నగరాలకు విస్తరించాయి. త్వరలోనే దేశంలోని ప్రధానమైన 13 నగరాలలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపాయి. తాజాగా దిగ్గజ కంపెనీలు 5జీకి సంబంధించి టెస్టింగ్ లు కూడా చేపడుతున్నాయి. ఈనెల అక్టోబర్ 1 నుంచి కొన్ని చోట్ల 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇందులో జియో, ఎయిర్ టెల్ ముందంజలో ఉన్నాయి. ఆయా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లలో కూడా 5జీ సేవలు అందుతున్నాయి. దీంతో కొత్త టెక్నాలజీకి ఫోన్లు అడాప్ట్ చేసుకుంటాయా అన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐ ఫోన్ తన ఫోన్లలో భారత్ లో ఈ ఏడాది డిసెంబర్ కల్లో 5జీ సేవలు(JIO 5G I Phone12) అందుబాటు లోకి తీసుకు వచ్చేలా చేస్తామని ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఊక్లా సంస్థ దేశంలో ఆయా టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న సర్వీసులు, స్పీడ్ పై సర్వే చేపట్టింది. జియోలో అత్యధికంగా 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ అవుతున్నట్లు గుర్తించింది. ఎయిర్ టెల్ మాత్రం 197.98 ఎంబీపీఎస్ కు మాత్రమే పరిమితమైందని ఊక్లా వెల్లడించింది.
ఎయిర్ టెల్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ , సిలిగురి, నాగ్ పూర్ , వారణాసి లలో అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రస్తుతానికి నాలుగు నగరాలలో మాత్రమే సేవలు అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 అత్యంత భద్రమైన ఫోన్ అని పేర్కొంది ఊక్లా.
Also Read : హుమా ఖురేషీ..ధావన్ హల్ చల్