India Abstains : ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్ కు భార‌త్ దూరం

143 మంది స‌భ్యులు తీర్మానానికి అనుకూలం

India Abstains : ఉక్రెయిన్ లో ర‌ష్యా విలీనాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్ కు భార‌త్ దూరంగా ఉంది. ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్దాన్ని నిలిని వేయాల‌ని, క్షిప‌ణుల ప్ర‌యోగం నిలిపి వేయాల‌ని కోరుతూ స‌భ్య దేశాలు తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి. ఈ తీర్మానానికి 143 మంది స‌భ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయ‌గా ఐదుగురు వ్య‌తిరేకంగా ఓటు వేశారు.

భార‌త్ స‌హా 35 మంది తీర్మానానికి దూరంగా ఉన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో ర‌ష్యా ఇదే విధ‌మైన ప్ర‌తిపాద‌న‌ను వీటో చేసిన కొద్ది రోజుల త‌ర్వాత ఈ తీర్మానం వ‌చ్చింది. దీనికి భార‌త‌దేశం(India Abstains) దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల‌ను ర‌ష్యా స్వాధీనం చేసుకోవ‌డాన్ని ఖండిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ స‌ర్వ స‌భ్య స‌మావేశం తీర్మానాన్ని ఆమోదించింది. భ‌ద్ర‌తా మండ‌లిలో ర‌ష్యా ఇదే విధ‌మైన ప్ర‌తిపాద‌న‌ను వీటో చేసిన కొద్ది రోజుల‌ త‌ర్వాత ఈ తీర్మానం వ‌చ్చింది.

ఎవ‌రూ వీటోను ఉప‌యోగించ‌ని చోట స‌భ్యులు ఆమోదించిన తాజా తీర్మానం ఇది. రెఫ‌రెండం అని పిల‌వ‌బ‌డే త‌ర్వాత నాలుగు ఉక్రేనియ‌న్ ప్రాంతాల‌లో ర‌ష్యా అక్ర‌మ విలీన ప్ర‌య‌త్నాల‌ను ఖండించింది.

యుఎన్జిఏలో ఉక్రెయిన్ , ర‌ష్యా ఘ‌ర్ష‌ణ ప‌డిన రెండు రోజుల త‌ర్వాత ఈ వీటోను ప్ర‌తిపాదించారు. ఉక్రెయిన్ భూ భాగాల‌ను మాస్కో అక్ర‌మ విలీన ప్ర‌య‌త్నాన్ని ఖండించేందుకు గాను ప్ర‌వేశ పెట్టిన ముసాయిదా తీర్మానంపై యుఎన్జీఏలో ర‌హ‌స్య బ్యాలెట్ నిర్వ‌హించాల‌న్న ర‌ష్యా పిలుపున‌కు స్పందించింది భార‌త్. అల్బేనియా బ‌హిరంగ ఓటును అభ్య‌ర్థించింది. విధాన ప‌ర‌మైన ఓటుకు భార‌త్ అనుకూలంగా ఓటు వేసింది.

Also Read : జి-20కి నేతృత్వం భార‌త్ కు క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!