Hijab Row : తీర్పు వ‌చ్చే వ‌ర‌కు హిజాబ్ పై నిషేధం

సుప్రీంకోర్టు ప్ర‌క‌టించే దాకా అమ‌లు

Hijab Row :  క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ప్ర‌క‌టించేంత వ‌ర‌కు రాష్ట్రంలో పాఠాశాల‌లు, కాలేజీల్లో హిజాబ్ పై(Hijab Row) నిషేధం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్ ప్ర‌క‌టించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఇవాళ క‌ర్ణాట‌క స‌ర్కార్ విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఆ మేర‌కు తుది తీర్పు వెలువ‌రించే బాధ్య‌త‌ను సీజేఐకి అప్ప‌గించింది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. దీంతో మంత్రి జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు వ‌చ్చేంత దాకా నిషేధం ఉండాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

ఇదే అమ‌లులో ఉంటుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఎవ‌రైనా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాద‌ని అనుకుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే క‌ర్ణాట‌క హైకోర్టు క‌ర్ణాట‌క స‌ర్కార్ తీసుకున్న హిజాబ్ నిషేధాన్ని స‌మ‌ర్థించింది. స్వాగ‌తించింది కూడా.

విద్యాల‌యాలు చ‌దువుకు కేంద్రాల‌ని ఇక్క‌డ మ‌తాల‌కు కేంద్ర బిందువు కాద‌ని వ్యాఖ్యానించింది. ఎవ‌రైనా స‌రే ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి తీరాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా తుది తీర్పు కోసం తాము ఎదురు చూస్తామ‌ని పేర్కొన్నారు మంత్రి బీసీ నగేష్. ఇదిలా ఉండ‌గా క‌ర్ఠాట‌క స‌ర్కార్ నిర్ణ‌యాన్ని సమ‌ర్థించారు జ‌డ్జి హేమంత్ గుప్తా.

పిటిష‌న్ల‌ను కొట్టి వేశారు. సుధాన్షు ధులియా వాటిని అనుమ‌తించారు. ఇదిలా ఉండ‌గా ఎటువంటి మ‌త చిహ్నాల‌కు ఆస్కారం ఉండ‌ద‌న్నారు . హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం న‌డుస్తాయ‌న్నారు. పిల్ల‌లు, విద్యార్థులు ఆ మేర‌కు రావాల‌ని కోరారు న‌గేష్‌.

Also Read : న‌మ్మ‌కం లేని వారే హిజాబ్ ధ‌రించ‌మంటారు

Leave A Reply

Your Email Id will not be published!