Madhusudhan Mistry : సీనియ‌ర్ ఆఫీస్ బేర‌ర్ల‌కు బిగ్ షాక్

ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మిస్త్రీ

Madhusudhan Mistry : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి అక్టోబ‌ర్ 17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇద్ద‌రు బ‌రిలో ఉన్నారు. ఒక‌రు గాంధీ ఫ్యామిలీ నుంచి మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మ‌రొక‌రు తిరువ‌నంతపురం ఎంపీ శ‌శి థ‌రూర్. ఇద్ద‌రూ పోటా పోటీగా ప్ర‌చారంలో నిమ‌గ్నం అయ్యారు. మొత్తం 9,000 మంది స‌భ్యులు ఈ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకుంటారు.

ఈనెల 19న తుది ఫ‌లితాన్ని ప్ర‌క‌టిస్తారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ(Madhusudhan Mistry). ఇదిలా ఉండ‌గా గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీనియ‌ర్ల‌కు షాక్ ఇచ్చారు. అదేమిటంటే సీనియ‌ర్ ఆఫీస్ బేర‌ర్లు త‌మ‌కు కేటాయించిన రాష్ట్రం నుంచి ఓటు వేయ‌లేర‌ని పేర్కొన్నారు. ఎవ‌రికి కేటాయించిన స్థానాల్లోనే వారు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే రూల్స్ గురించి అభ్య‌ర్థుల‌కు, ఓటు వేసే వారికి తెలియ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌లు పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో జ‌రుగుతాయ‌ని ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు మిస్త్రీ. సీనియ‌ర్ ఆఫీస్ బేరర్లు త‌మ సొంత రాష్ట్రాల్లోని బూత్ ల‌లో లేదా ఏఐసీసీ కార్యాల‌యాల్లో ఓటు వేయాల‌ని కోరారు.

శ‌శి థ‌రూర్ చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు మిస్త్రీ. అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర ఇన్ చార్జ్ లు , కార్య‌ద‌ర్శులు, జాయింట్ సెక్ర‌ట‌రీలు త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల నుంచి రానున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అనుమ‌తించ బోమ‌ని స్ప‌ష్టం చేశారు మ‌ధుసూద‌న్ మిస్త్రీ.

Also Read : హార్దిక్ ప‌టేల్ పై కాంగ్రెస్ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!