Putin : నాటోకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
మాతో పెట్టుకుంటే ప్రపంచ యుద్దమే
Putin : యావత్ ప్రపంచం నెత్తీ నోరు మొత్తుకున్నా వినిపించు కోవడం లేదు రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది రష్యా. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని మట్టు బెట్టడం దిశగా పుతిన్(Putin) ప్లాన్ చేశాడు.
తనను ఎదిరించిన అతగాడు ఉండేందుకు వీలు లేదని కన్నెర్ర చేశాడు. ఆ దిశగా ముందస్తు హెచ్చరిక లేకుండానే సైనిక చర్య పేరుతో దురాక్రమణకు పాల్పడ్డాడు. ఆపై బాంబులు, క్షిపణుల మోత మోగిస్తూ ఉక్రెయిన్ ను సర్వ నాశనం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి మొత్తుకుంది.
ఇక చాలా దేశాలన్నీ దీనిని ఖండించాయి. నిరసించాయి. యుద్దం ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశాయి. యుఎన్ఓ జనరల్ సెక్రటరీ ఉక్రెయిన్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ విధ్వంసం అత్యంత అమానవీయమని పేర్కొన్నాడు. వెంటనే యుద్దాన్ని ఆపాలని కోరాడు. ఇదిలా ఉండగా యుఎస్ తో పాటు నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ వైపు నిలబడ్డాయి. మరో వైపు చచ్చినా సరే తాను లొంగి పోయే ప్రసక్తి లేదంటున్నాడు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. ఈ తరుణంలో తాజాగా సంచలన ప్రకటన చేశాడు రష్యా చీఫ్ పుతిన్(Putin) .
నాటో గనుక తమతో ఘర్షణకు దిగితే మూడో ప్రపంచ యుద్దం రాక తప్పదని హెచ్చరించారు. తాజాగా పుతిన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా లోకం విస్తు పోయింది. ఇలాంటి దుందుడుకు చర్యకు దిగవద్దంటూ కోరాయి.
Also Read : విపరీత విధానాలు ప్రమాదకరం