KBC Lottery Fake : కేబీసీ వాట్సాప్ లాట‌రీ మెస్సేజ్ డేంజ‌ర్

ఇలాంటి మెస్సేజ్ లు ప్ర‌మాద‌క‌రం

KBC Lottery Fake : మీకు వాట్సాప్ ఉందా. అయితే జ‌ర జాగ్ర‌త్త‌. కొంద‌రు కేటుగాళ్లు సైబ‌ర్ నేరానికి పాల్ప‌డుతున్నారు. అంద‌మైన గొంతుతో మిమ్మ‌ల్ని మెస్మ‌రైజ్ చేస్తారు. ఆపై మీరు క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న డ‌బ్బుల‌ను మెల్ల‌గా దోచేస్తారు. దీనికి సంబంధించి కేంద్రం సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది.

విచిత్రం ఏమిటంటే గుర్తు తెలియ‌ని నెంబ‌ర్ నుంచి మీకు వాట్సాప్(KBC Lottery Fake) గ‌నుక ఉంటే దానికి మెస్సేజ్ వ‌స్తుంది. ఈ మెస్సేజ్ తో పాటు ఓ వీడియో , ఫోటో కూడా ఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రి మోదీ, అమితాబ్ బ‌చ్చ‌న్ ఫోటో కూడా ఉండ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు పొందింది ప్ర‌ముఖ న‌టుడు బిగ్ బి నిర్వహిస్తున్న కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. ఇదే సంక్షిప్తంగా అంద‌రికీ తెలిసిందే కేబీసీ.

దీనిని పోలిన షోలు ఎన్నో వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. కానీ బిగ్ బి షో కు మాత్రం ఇంకా ఆద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. దీనిని గ‌మ‌నించిన కేటుగాళ్లు వాట్సాప్ ద్వారా లాట‌రీ తీశామ‌ని, మీకు రూ. 25 ల‌క్ష‌ల రివార్డు ల‌భించింద‌ని పేర్కొంటారు. ఆపై ఎస్బీఐ వ‌ద్ద‌కు వెళ్లాల‌ని, మీకు పంపించిన లాట‌రీ నెంబ‌ర్ చెప్పాల‌ని సూచిస్తారు.

అక్క‌డికి వెళ్లాక మొద‌ట కొన్ని డ‌బ్బులు డిపాజిట్ చేయాల‌ని కోరుతారు. వాటిని జ‌మ చేశాక మీకు ల‌భించిన రివార్డు రూ. 25 లక్ష‌లు ఇస్తామంటూ న‌మ్మిస్తారు. తీరా క‌ట్టాక ఎలాంటి రెస్పాన్స్ అంటూ ఉండ‌దు. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగింది కేంద్ర స‌ర్కార్ .

ఈ వాట్సాప్ కేబీసీ రూ. 25 ల‌క్ష‌ల రివార్డుతో ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీని ప‌ట్ల వాట్సాప్ యూజ‌ర్లు, ఇత‌రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరింది. సో మీకు గ‌నుక ఇలాంటి మెస్సేజ్ వ‌స్తే జ‌ర జాగ్ర‌త్త‌.

Also Read : ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – బీపీసీఎల్

Leave A Reply

Your Email Id will not be published!